రేపే దుబ్బాక ఉప ఎన్నిక..

1747
dubbaka by poll
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం జరగనుంది. దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి మరణంతో.. ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా టీఆర్‌ఎస్ తరఫున రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కత్తి కార్తీక బరిలో ఉన్నారు.

అయితే మంగళవారం జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌‌‌‌ జరుగనుంది. ఈ నెల 10న ఓట్లు లెక్కిస్తారు. దుబ్బాక నియోజకవర్గంలో 1,98,807 మంది ఓటర్లు ఉన్నారు. 98028 మంది పురుషులు, 100719 మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

నియోజకవర్గంలోని 8 మండలాల్లో 315 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో.. 89 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అక్కడ రెట్టింపు స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 315 బూతుల గాను 315 ఈవీఎంలతో పాటు అదనంగా మరో 120 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. సోమవారం పోలింగ్ సామాగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ బూతులకు తరలివెళ్లారు. వృద్ధులు, వికలాంగులు ఓటేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. నియోజకవర్గంలోని కరోనా బాధితులు ఓటేసేందుకు ప్రత్యేక సమయం కేటాయించారు.ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సిద్దిపేట జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు.

- Advertisement -