రాములోరి పెళ్లికి సర్వం సిద్ధం..

649
sriramanavami
- Advertisement -

భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలం రామాలయం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చలువ పందిళ్లు, కళ్లు మిరమిట్లుగొలిపే విద్యుత్ దీపాలంకరణతో భద్రాద్రి ఆధ్యాత్మిక సంద్రంగా మారింది. రామాలయంతో పాటు పరిసరాలను ముస్తాబు చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారికి అగ్ని ప్రతిష్ట ఘనంగా జరిగింది.

కల్యాణం అప్పారావు నేతృత్వంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను నేడు భద్రాచలం తీసుకురానున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14వ తేదీన శ్రీసీతారాముల కల్యాణం, 15న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకస్వాములు ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి సర్వం సిద్ధం చేసుకున్నారు.

Image result for sriramanavami badradri

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ధ్వజపట భద్రక మండల లేఖనం వేడుకను వైభవంగా నిర్వహించారు. రామాలయంలో స్వామివారికి ఏకాంత స్నపనం గావించారు. సాయంత్రం భాజాభజంత్రీలు, సన్నాయి మేళాల నడుమ జీయర్‌మఠం వద్దకు ఊరేగింపు జరిపారు. యాగశాలలో గరుడాదివాసం, గరుడ జపం, గరుడ హోమం, మహాకుంభ ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలు కనుల పండువగా నిర్వహించారు.తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది శ్రీరాముని కల్యాణాన్ని వీక్షించేందుకు తరలిరానుండటంతో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -