నేడు సద్దుల బతుకమ్మ..

429
Telangana
- Advertisement -

తెలంగాణ ఆడపడచులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. నేటితో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి. సద్దుల బతుకమ్మ వేడుకల్ని అత్యంత అద్భుతంగా ఇవాళ జరపబోతున్నారు. ఇందుకోసం… తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఎల్బీ స్టేడియం, హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిలసరాలు మొత్తం సరికొత్తగా దర్శనమిస్తున్నాయి. ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మను ఏర్పాటు చేయనున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మలతో ర్యాలీగా వెళ్లనున్నారు.

ఇలా తొమ్మిదో రోజు బతుకమ్మ సంబరాల్ని విజయోత్సవంలా జరుపుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ కార్యక్రమంలో వేల మంది కళాకారులు… బతుకమ్మల ర్యాలీ నిర్వహించబోతున్నారు. వీటికి తోడు… హుస్సేన్ సాగర్‌లో వెలుగుల బతుకమ్మలను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రజలంతా తరలిరావాలని ప్రభుత్వం కోరింది.సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఆడపడచులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపిచ్చారు. చెరువుల దగ్గర నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లూ చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -