బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తాం: సీఎం కేసీఆర్

58
cm kcr
- Advertisement -

దేశాన్ని పాలించడం అంటే అమ్మడమేనా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్…కేంద్ర బడ్జెట్‌పై తనదైనశైలీలో స్పందించారు. కేంద్ర బడ్జెట్ దారుణంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు.

దేశంలో బీజేపీ పాలన ఎలా ఉందంటే.. దేశాన్ని అమ్మడం, మతపిచ్చి పెంచి ఓట్లు సంపాదించుకోవడమని కేసీఆర్ విమర్శించారు.ఇప్పటికే ఎయిరిండియాను అమ్మేశారని, ఎల్‌ఐసీని కూడా అమ్ముతామని బడ్జెట్‌లో నిసిగ్గుగా చెప్పారని కేసీఆర్ ఆరోపించారు.

లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని… పెట్టుబడి రెట్టింపు చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేశారు. ఎస్సీల జనాభాపై కేంద్రం చెప్తున్న లెక్కలు తప్పు అని… దేశంలో ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. బడ్జెట్‌లో నదుల అనుసంధానం మిలీనియం జోక్ అని కేసీఆర్ అభివర్ణించారు. బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పారేస్తామని మండిపడ్డారు.

- Advertisement -