విజయ్ దేవరకొండ “ఫైటర్” లో అలియా భట్

536
vijay devarakonda aliya bhatt
- Advertisement -

రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. ఈమూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈమూవీలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా నటిస్తుంది. ఇప్పటికే ఈమూవీలో విజయ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈసినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. కాగా ఈమూవీ తర్వాత విజయ్ దేవరకొండ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే పూర్తి స్క్రీప్ట్ తో రెడీ గా ఉన్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.

జనవరి నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పూరి ఈ సినిమాకి పాన్ ఇండియా స్థాయిని తీసుకొచ్చే క్రమంలో కరణ్ జొహార్ ను నిర్మాణ భాగస్వామిగా చేసుకున్నాడు. అయితే విజయ్ సరసన హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు దర్శకుడు పూరీ. హీరోయిన్ విషయాన్ని నిర్మాత కరణ్‌ జోహర్ అప్పగించాడట. జాన్వీ కపూ, సారా అలీఖాన్ , అలియా భట్ లలో ఎవరినో ఒకరిని ఫైనల్ చేయాలని ఆలోచిస్తున్నారట. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం అలియా భట్ ను ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈవిషయంపై చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో ఈమూవీపై భారీగా ఆశలు ఉన్నాయి.

- Advertisement -