- Advertisement -
బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం మధ్యాహ్నాం బాంద్రాలోని వాస్తు హోమ్‌లో ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఆలియా–రణ్‌బీర్ వివాహం వైభంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నూతన జంటకు పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వీరి రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కి ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు వార్తలు వస్తుండగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం జరిగే రిసెప్షన్‌కు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించనున్నారు.
- Advertisement -