షాకింగ్ విషయాలు వెల్లడించిన ఆలియా భట్ తల్లి..!

244
- Advertisement -

దేశవ్యాప్తంగా “మీటూ” ఉద్యమం తారాస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం ద్వారా చిత్ర పరిశ్రమలో లైగింక వేధింపులు ఎదుర్కున్న మహిళలు ముందుకు వచ్చి తమ బాధలను చెప్పుకుంటున్నారు. లైగింక వేధింపులకు గురయ్యామని ఇప్పటికే కొంతమంది మహిళలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక తాజాగా ప్రముఖ నిర్మాత మహేష్ భట్ భార్య, ఆలియా భట్ తల్లి సోనీ రజ్ధాన్ తనపై లైంగిక దాడి జరిగిందని షాకింగ్ విషయాలు వెల్లడించింది.

అయితే.. తనపై దాడి చేసిన వ్యక్తి పేరు మాత్రం బయటపెట్టకుండ సస్పెన్స్ క్రియేట్ చేసింది. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు లైంగిక వేధింపులు ఎదురుకాకపోవడంతో తాను అదృష్టంగా ఫీలవుతానని ఓ ఇంటర్య్కూలో తెలిపింది. కానీ ఓ సినిమా షూటింగ్ సమయంలో ఓ వ్యక్తి తనపై అత్యాచార ప్రయత్నం చేయడం తనను భయభ్రాంతులకు గురిచేసిందని చెప్పింది. ఇక ఇప్పుడు తన పేరు చెప్పి, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టలేనని వ్యాఖ్యానింది. అతనికి భార్య, పిల్లలు ఉన్నారని.. ఇప్పటికే అతను చేసిన పోరపాట్లకు శిక్ష అనుభవించే ఉంటాడని తెలిపింది. “మీటూ” ఉద్యమంలో భాగంగా మహిళలు బయటికి వచ్చి లైంగిక వేధింపుల గురించి చెప్పడం గొప్ప విషయమని సోనీ అంటుంది.

ప్రస్తుతం లైంగిక వేధింపులు ఎర్కుంటున్న ప్రముఖ నటుడు అలోక్‌నాథ్ గురించి ఆమె మాట్లాడుతూ.. అతనితో కలిసి పని చేశానని చెప్పింది. ఆయన ప్రవర్తన సరిగా లేకపోవడం, అలోక్ తనను చూసే విధానం తనకు నచ్చేది కాదని తెలిపింది. ఆయన అమర్యాద ప్రవర్తన ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందని సోనీ రజ్ధాన్ షాకింగ్ విషయాలు వెల్లడించింది.

- Advertisement -