పిక్ టాక్ : ఎవరీ దేవకన్య.. అలియా భటేనా?  

52
- Advertisement -

నేటి హిందీ క్యూట్ నటిగా వెలిగిపోతున్న ‘అలియా భట్’ కొత్త ఫోటో షూట్  ప్రస్తుతం  సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.  అందమైన డిజైనర్  డ్రెస్ లో అందాల తారలు మరింత అందంగా కనిపిస్తారని అలియా ఫోటోతో మరోసారి  రుజువు అయ్యింది. తళుకుబెళుకుల డ్రెస్ లో దివి నుండి దిగివచ్చిన దేవకన్యలా అలియా భట్ మెరిసిపోతోంది.  తన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా  మంత్రముగ్ధుల్ని చేస్తోంది.  అలియా అందాన్ని రెట్టింపు చేసే దుస్తుల్లో స్టైలిష్ డ్రెస్ లదే  మొదటి ప్లేస్.  ఒంపుసొంపుల్ని అందంగా చూపించడంలో.. ఆ అందాలను కనిపించీ కనిపించకుండా ఊరించేలా చేయడంలో  అలియా ఎప్పటి నుంచో ఆధిపత్యం చెలాయిస్తోంది.

అసలు అలియా భట్ తాజా లుక్ చూశాక,  ఇక ఎన్ని మాటలు ముచ్చటించుకున్నా తక్కువే.  నల్లని మెరుపుల డ్రెస్ కు, అదే రంగు బ్యాక్‌లెస్ బ్లౌజ్‌తో అలియా  అదరగొడుతోంది. ఈ ఒక్క స్టిల్ తో  నెటిజన్లు మనసును సాంతం దోచింది. పై నుంచి కిందివరకు ఒకే రంగు అయినా,  కాస్త వెరైటీ ఫోజు పెట్టి  అద్భుతం అనిపించింది.  అచ్చం దేవకన్య ఫోజులో మ్యాచింగ్ డ్రెస్ లో మైమరిపిస్తుంది.  చెవులకు కొద్దిగా ఊగే కమ్మలతో.. విరబూసిన జుట్టును  సెలయేరులా అలా వదిలేసి,  ఫ్రెమ్ కు అలియా  తన అద్భుతమైన అందాన్ని అద్దింది.

మొత్తమ్మీద అలియా భట్ కొత్త ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘అలియా న్యాచురల్ బ్యూటీ’ అంటూ కొందరు,  ‘దేవకన్య దిగొచ్చింది’  అంటూ మరికొందరు  తమ స్పందనలు కామెంట్ల  రూపంలో తెలియజేస్తున్నారు. మరి మీ కామెంట్లను  కూడా   కింద కామెంట్ల రూపంలో తెలపండి. ఇంతకీ  అలియా భట్ భారీ అందాల ఫోటోల పై మీరు  ఓ లుక్కేయండి.

Also Read:హ్యాపీ బర్త్ డే..ఐష్

- Advertisement -