చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, వరుస సినిమాలతో హిట్లు కొడుతూ బిజీ భామగా మారిపోయింది అలియాభట్. పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే చాలు ఎగిరి గంతులేస్తారు కొంత మంది హీరోయిన్లు.
కానీ అలియా మాత్రం ఆ టైప్ కాదు. తాను చేసే ప్రతి సినిమాలోనూ తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇక హీరోయిన్ పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదని తెలిస్తే మాత్రం ఎంత పెద్ద సినిమాకైనా మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. ఈ క్రమంలో రీసెంట్ గా అమిర్ ఖాన్ సినిమాకి కూడా నో చెప్పేసింది అలియా.
అందుకే ఈ అమ్మడు చేసే సినిమాల్లో తన క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అయితే బాలీవుడ్ లో ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆలియా భట్ ని.. లేడీ అమితాబ్ బచ్చన్ అంటున్నాడు నటుడు రణ్‌బీర్ కపూర్. ఇటీవల వీరిద్దరూ మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్’గా అవార్డులు అందుకొన్నారు.
ఈ సందర్భంగా రణ్‌బీర్ ఆలియా గురించి మాట్లాడుతూ..చిన్నవయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుసహిట్లు సాధించిన ఆలియా లేడీ అమితాబ్ బచ్చన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ తర్వాత ఆలియా మాట్లాడుతూ.. తాను నటించిన ‘ఉడ్తా పంజాబ్’లో తన నటనకు గానూ జాతీయ అవార్డు రాకపోవడం గురించి ప్రస్తావించింది. అవార్డు రానందుకు బాధలేదని ఎంత కాలమైనా ఇండస్ట్రీలోనే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా సాధించగలనని చెప్పింది. ఇక త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ సినిమా రాబోతోంది.