ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ప‌రిచ‌యం గురించి చెప్పిన అలీ..

348
ali says how to introduce with paower star pawan kalyan...
- Advertisement -

హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌మెడియ‌న్ అలీ ఎంత మంచి స్నేహితులో మ‌న‌కు తెలిసిందే. టాలీవుడ్ క‌మెడియ‌న్ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో అత్యంత స‌న్నిహితంగా ఉండేది ఒక్క అలీ మాత్ర‌మే. సినిమాల్లోనే కాకుండా…బ‌య‌ట కూడా విరిద్ద‌రూ చాలా క్లోజ్ గా ఉంటారు. ప‌వ‌న్ తో క‌లిసి ఆలీ చాలా సినిమాల్లో న‌టించాడు. ఒకానోక సంద‌ర్భంలో అలీ లేకుండా తన సినిమా ఉండ‌ద‌ని కూడా చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అలీ కూడా త‌న ఫేవరేట్ హీరో ఎవ‌రూ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు చెబుతాడు. తాజాగా అలీ ఇచ్చిన ఓ ఇంట‌ర్యూలో ప‌వ‌న్ క‌ళ్యాన్ కు త‌న‌కు మ‌ధ్య ప‌రిచ‌యం ఎలా ఎర్ప‌డిందో చెప్పారు.ali says how to introduce with paower star pawan kalyan...

చిరంజీవి ముగ్గురు మొన‌గాళ్లు సినిమా చేస్తున్న స‌య‌మంలో వ‌ర్షంలో ఫైట్స్ చేసిన ఆయ‌న అల‌సిపోయి ఇంటి ద‌గ్గ‌ర విశ్రాంతి తిసుకుంటున్నారు. ఆ స‌మంయంలో నేను ఆయ‌న‌కు ఫోస్ చేస్తే ఇంటికి ర‌మ్మ‌నడంతో అత‌ని ఇంటికి వెళ్లాన‌ని చెప్పారు అలీ. నేను చిరంజీవి ఇంటికి వెళ్ల‌గానే మొద‌ట ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను చూశాన‌న్నారు. అప్పుడు నన్ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ల‌క‌రించి మీరు వ‌స్తార‌ని అన్న‌య్య త‌న‌కు చెప్పారంటూ ఆయ‌న చాలా గౌర‌వంగా ప‌ల‌క‌రించార‌న్నారు. ఆ త‌ర్వాత ఒక‌టి రెండుసార్లు ఇద్ద‌రం క‌లిసామ‌న్నారు. ali says how to introduce with paower star pawan kalyan...

ఇక‌ సినిమాల‌కు వ‌చ్చిన త‌ర్వాత మా ఇద్ద‌రి మ‌ధ్య బంధం మ‌రింత పెరిగింద‌న్నారు. ఆయ‌న‌తో ఎక్కువ‌గా సినిమాలు చేయ‌డం వల్లే ఆయ‌న‌తో అంత చ‌నువుగా ఉంటాన‌న్నారు. నా గురించి చిరంజీవి, నాగ‌బాబు గారు ప‌వ‌న్ కి మంచి చెప్ప‌డం వ‌ల్ల‌నే ఆయ‌న నాకు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యార‌న్నారు. మెగా ఫ్యామిలితో కూడా త‌న‌కు మంచి అనుబంధం ఉంద‌ని చెప్పుకొచ్చారు అలీ.

- Advertisement -