ఈ టీజర్‌లో ‘అలాంటి సిత్రాలు’ చూడండీ..!

222
Alanti Sitralu
- Advertisement -

టాలీవుడ్‌లో నూతన దర్శకుడు సుప్రీత్ సి.కృష్ణ అలాంటి సిత్రాలు మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను ఐ అండ్ ఐ ఆర్ట్స్ కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాహుల్ రెడ్డి నిర్మిస్తుండగా.. ప్రముఖ జర్నలిస్ట్ కే. రాఘవేంద్రరెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేసిన ఈ టీజర్‌.. చూస్తే ఈ సినిమా నలుగురు డిఫరెంట్ జీవితాల ఇతివృత్తం. డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ కలిగిన వ్యక్తులు ఒకేబాటలో ఎదురైతే ఏర్పడే పరిస్థితులను చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్.

‘ఒకటి గుర్తు పెట్టుకో.. మనం నాశనమవ్వాలంటే అన్నీ సహకరిస్తాయి. కానీ బాగు పడాలంటేనే వంద అడ్డంకులొస్తాయి.” అంటూ ఒక ప్రధాన పాత్రధారి ప్రవీణ్ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుంది. లేడి క్యారెక్ట‌ర్ వేశ్య‌గా క‌నిపిస్తుంది.

- Advertisement -