- Advertisement -
ఆల్ ఖైదాకు గట్టి షాక్ తగిలింది. ఉత్తర ఆఫ్రికాకు చెందిన ఆల్ ఖయిదా నేత అబ్దెల్‌మాలిక్‌ను హతమార్చినట్లు ఫ్రాన్స్ ప్రకటించింది.
మాలేలో జరిగిన ఈ ఆపరేషన్‌లో మాలిక్‌తో సహా కొంతమంది హతమైనట్లు ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రి ఫ్లోరెన్స్ తెలిపారు.
40 ఏళ్ల అబ్దెల్‌మాలిక్ గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న సోవియేట్ దళాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఇరాక్‌లోనూ ఆల్‌ఖయిదా నేతగా కొనసాగాడు. మాలే, బుర్కినోఫాసోలో జరిగిన పలు ఉగ్రవాద దాడులకు ఇతనే కారణం. పేలుడు పదార్ధాల తయారీలో డ్రౌకడెల్ నిష్ణాతుడు.
దశాబ్ధ కాలం నుంచి అబ్దెల్‌ను పట్టుకునేందుకు ఫ్రాన్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఫ్రాన్స్ చేపడుతున్న డేరింగ్ ఆపరేషన్స్‌తో ఉగ్రవాద గ్రూపులకు భారీ షాక్ తగిలింది.
- Advertisement -