- Advertisement -
దేశంలో కరోనా రోజురోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దేశంలో మే 3 వరకు తెలంగాణలో మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. లాక్ డౌన్ ఆర్ధికవ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.
అన్నిరంగాలపై తీవ్ర ప్రభావం చూపింది కరోనా. ఈ నేపథ్యంలో అక్షయ తృతీయపై కూడా కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించనుంది. సాధారణంగా అక్షయతృతీయ వచ్చిందంటే బంగారం షాపులు కిటకిటలాడేవి. ఎందుకంటే ఆరోజు ఎంతోకొంత పసిడిని కొంటే సిరి సంపదలు వస్తాయని నమ్మకం. అందుకే మంచిమంచి ఆఫర్లతో బంగారు దుకాణాలు కస్టమర్లను ఆకట్టుకునేవి.
కానీ ఈసారి అక్షయతృతీయకు కరోనా రూపంలో బ్రేక్ పడినట్లే. ఏప్రిల్ 26న బంగారం షాపులు వెలవెలబోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పసిడి ప్రేమికులు నిరాశ చెందుతున్నారు.
- Advertisement -