బన్నీని సేవ్ చేసిన అక్షయ్ కుమార్

58
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప అనే ఒక్క సినిమాతోనే అల్లు అర్జున్ కి దేశ, విదేశాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. మరి ఆ క్రేజ్ ను కాపాడుకోవాలి కదా. అందుకే.. ప్రస్తుతం అల్లు అర్జున్ ఏం చేసినా పాన్ ఇండియా ఆలోచనలతోనే చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ సాలిడ్ క్యామియో రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను తీసుకుంటున్నారని తెలుస్తోంది. నిజానికి అక్షయ్ కుమార్ ఈ పాత్ర చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ, బన్నీ రిక్వెస్ట్ మేరకు ఎట్టకేలకు అక్షయ్ కుమార్ పుష్ప 2 లో స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ, ఒకవేళ నిజం ఉంటే మాత్రం.. పుష్ప 2 కి బాలీవుడ్ లో కూడా భారీ మార్కెట్ అవుతుంది. ఇంతకీ అక్షయ్ కుమార్ ఏ పాత్రలో నటిస్తున్నాడో తెలుసా ?, ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. సిన్సియర్ పోలీస్ అయిన అక్షయ్ కుమార్, ఓ సమయంలో బన్నీ ప్రాణాలను సేవ్ చేస్తాడట, ఆ సంఘటన తర్వాత నుంచి బన్నీలో మార్పు వస్తోంది అని, నెగిటివ్ మోడ్ నుంచి పాజిటివ్ టోన్ లోకి బన్నీ క్యారెక్టర్ టర్న్ అవుతుంది అని తెలుస్తోంది. మొత్తానికి ఈ వార్త అయితే, బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ను నింపింది.

ఇక పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న పుష్ప 2 జపాన్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది బన్నీ – సుకుమార్ ప్లాన్. ఆ ప్లాన్ కి తగ్గట్టు సుకుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుంటూ వెళ్లారు. తన టీమ్ తో స్క్రిప్ట్ పై కసరత్తులు చేశారు. ఓవరాల్ గా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అద్భుతంగా వచ్చాయట.

ఇవి కూడా చదవండి..

- Advertisement -