బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ దంపతులు తాము తల్లిదండ్రులు కాబోతున్నామని సోషల్ మీడియాలో ప్రకటించిన తర్వాత, వారి సన్నిహిత మిత్రుడు అక్షయ్ కుమార్ ఒక ప్రత్యేక అభ్యర్థన చేశారు. ఈ ఆనంద క్షణాన్ని పంచుకుంటూ ఆయన కామెంట్ చేశారు: “కత్రినా, విక్కీ, మీ కోసం చాలా సంతోషంగా ఉంది. బస్, బేబీకి ఇంగ్లీష్, పంజాబీ రెండింటినీ సమానంగా నేర్పించాలి అని తెలిపారు.
2021లో వివాహం చేసుకున్న ఈ జంట గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో విక్కీ, కత్రినాను కౌగిలించుకుని, ఆమె బేబీ బంప్‌ను ముద్దుగా పట్టుకుని నిలిచాడు. ఈ ప్రకటన అనంతరం పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు వారికి ప్రేమాభినందనలు తెలియజేశారు.
అక్షయ్ కుమార్ కామెంట్ చేస్తూ, “కత్రినా, విక్కీ, మీ కోసం చాలా సంతోషంగా ఉంది. మీరు ఇద్దరూ అద్భుతమైన తల్లిదండ్రులు అవుతారని నాకు తెలుసు అని రాశారు. తర్వాత ఆయన సరదాగా, “బస్ బేబీకి ఇంగ్లీష్, పంజాబీ రెండూ సమానంగా నేర్పించండి ..ఎంతో ప్రేమ, ఆశీస్సులు. జై మహాదేవ్ అని పేర్కొన్నారు. అని చేర్చారు.
2021లో రాజస్థాన్‌లోని సావాయి మాధోపూర్, సిక్స్ సెన్సెస్ రిసార్ట్, ఫోర్ట్ బర్వారాలో ఘనంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి నేహా ధూపియా-అంగద్ బెడి, కబీర్ ఖాన్-మినీ మథూర్, శర్వరి వాఘ్, మలవికా మోహనన్ వంటి సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లి వరకు తమ సంబంధాన్ని ఈ జంట రహస్యంగానే ఉంచారు.విక్కీ, అమర్ కౌశిక్ దర్శకత్వంలో 2026లో విడుదల కానున్న మహావతార్ చిత్రంలో భగవాన్ పరశురామ పాత్రలో కనిపించనున్నారు.
Also Read:OG తుపాను..బుక్ మై షోలో రికార్డు!

