బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా తన సినిమా పేరు చెప్పగానే మోడీ పగలబడి నవ్వారని అక్షయ్ వెల్లడించారు. ప్రస్తుతం అక్షయ్ ‘టాయ్‌లెట్-ఏక్ ప్రేమ్‌కథా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్’ క్యాంపెయిన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ సేవలను కొనియాడిన ప్రధాని మోడీ, అక్షయ్ తరువాతి ప్రాజెక్టు పేరు అడిగారు. ఈ సందర్భంగా అక్షయ్.. మోడీని కలిసి సినిమా గురించి వివరించారు. అయితే అక్షయ్ తన సినిమా టైటిల్ గురించి చెప్పగానే మోడీ నవ్వు ఆపుకోలేకపోయారట. ఈ విషయాన్ని అక్షయ్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడిస్తూ.. ఆయన నవ్విన క్షణాన్ని మాత్రం మర్చిపోలేనని చెప్పారు.
ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ కట్టేందుకు సిద్ధపడతారు. అలాంటిది ప్రేమకు గుర్తుగా ఓ మరుగు దొడ్డి కట్టించిన వ్యక్తి కథే ఈ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ. స్వచ్ఛ్ భారత్ ఇనిస్పిరేషన్ తో బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాకు టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ అనే టైటిల్ పెట్టాడు. ఏ వెడ్నస్ డే, బేబి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కావడం… మోడీ స్వచ్ఛ భారత్ స్పూర్థితో తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడంతో… ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో అక్షయ్‌కి జోడీగా భూమి పెడ్నేకర్ నటిస్తోంది. శ్రీనారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది.
హీరో చెప్పిన మాటల్ని అందరూ పాటించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్ట బోయే మొబైల్ టాయిలెట్ల పథకానికి అంబాసిడర్ గా అక్షయ్ నే ఎంచుకున్నారు.