అక్ష‌య్ ‘కేస‌రి’ ఫస్ట్‌లుక్‌..

236
Akshay Kumar Begins Kesari With Intriguing First Look
- Advertisement -

అక్షయ్ కుమార్ గత కొన్నేళ్లలో విలక్షణమైన పాత్రలు.. భిన్నమైన సినిమాలతో తన ఇమేజ్ ఎంతో పెంచుకున్నాడు. ఈ ఏడాది అక్షయ్ నుంచి ‘ఎయిర్ లిఫ్ట్’.. ‘జాలీ ఎల్ఎల్బీ-2’.. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ మంచి విజయం సాధించాయి. అక్షయ్ కు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. గణతంత్ర దినోత్సవ కానుకగా రాబోతున్న అక్షయ్ కొత్త సినిమా ‘ప్యాడ్ మ్యాన్’ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. మహిళలు రుతుక్రమం సమయంలో వాడే ప్యాడ్ల నేపథ్యంలో ఈ సినిమా సాగడం విశేషం. దీని ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీని తర్వాత అక్షయ్ మరో సెన్సేషనల్ మూవీతో రాబోతున్నాడు. అదే ‘కేసరి’.

‘ప్యాడ్ మ్యాన్’ చిత్రం విడుద‌లకు సిద్ధంగా ఉండ‌గానే త‌న త‌దుప‌రి చిత్రం ‘కేస‌రి’కి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను ఆయ‌న షేర్ చేశారు. ఈ ఫ‌స్ట్‌లుక్‌లో మీసాలు, గ‌డ్డంతో సిక్కు టోపీ ధ‌రించి ఉన్న అక్ష‌య్‌ని చూడొచ్చు. గ‌తంలో చాలా సినిమాల్లో అక్ష‌య్ సిక్కు టోపీ ధ‌రించి న‌టించాడు. చారిత్ర‌క క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది.

2018లో త‌న మొద‌టి ప్రాజెక్టు అంటూ అక్ష‌య్ ఈ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫ‌స్ట్‌లుక్‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతూ నిర్మాత క‌ర‌ణ్ జొహార్ కూడా ట్వీట్ చేశారు. 2019 హోళీ సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు క‌ర‌ణ్ గ‌తంలో ప్ర‌క‌టించారు. బ్రిటీష్ ఇండియ‌న్ బృందాల‌కు, ఆఫ్ఘ‌నిస్థాన్ బృందాల‌కు మ‌ధ్య జ‌రిగిన స‌రాగ‌ర్హి యుద్ధం నేప‌థ్యంలో ఈ క‌థ న‌డ‌వనుంది. ఈ చిత్రానికి అనురాగ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

- Advertisement -