అదిరిపోయేలా ‘అక్షర’ టీజర్‌.. వీడియో

349
Akshara Movie Teaser
- Advertisement -

క్రైమ్ థ్రిల్లర్స్ కు ఇటీవలి కాలంలో మంచి ఆదరణ దక్కుతున్న నేపధ్యంలో వస్తున్న మరో సినిమా అక్షర. నందిత శ్వేతా ప్రధాన పాత్రలో చిన్ని కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ తీసిన ఈ మూవీ టీజర్ తాజాగా విడుదల చేశారు.

అజయ్ ఘోష్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. అక్షరపై మనసు పారేసుకున్న అజయ్ ఘోష్ .. షకలక శంకర్ .. సత్య .. మధునందన్ ల చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం ఈ టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. ఆమెను చంపేయాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేస్తారు. ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలపై ఆసక్తిని పెంచుతూ టీజర్‌ను కట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -