యువ దర్శకుడితో ఓకే అంటున్న కింగ్‌..

260
Akkineni Nagarjuna Upcoming Movie
- Advertisement -

చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న చిత్రం రాజు గారి గది. ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమే “రాజు గారి గది 2”. కింగ్ నాగార్జున ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్-ఓక్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే నాగర్జున ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాను తన సొంత బ్యానర్ పై నిర్మించి చైతూకి విజయాన్ని అందించాడు.ఇక తాను ప్రధాన పాత్రగా ‘రాజుగారి గది 2’ ను పూర్తి చేసి అఖిల్ సినిమాపై దృష్టి పెట్టాడు. నాగ్ నిర్మాతగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే తాను హీరోగా ఒక సినిమా చేయడానికి నాగార్జున రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

Akkineni Nagarjuna Upcoming Movie

అయితే ముందుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయాలనుకున్నప్పటికీ, ఆ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువ దర్శకుడు వినిపించిన కథ ఆయనకి బాగా నచ్చేసిందట. దాంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి చకచకా ఏర్పాట్లు చేసుకోమని చెప్పినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారట.

- Advertisement -