రజినీ కోసం రాస్తే.. నాగ్‌ నటిస్తున్నాడు

228
Akkineni Nagarjuna
- Advertisement -

తమిళ స్టార్ హీరో ధనుష్ నటుడిగా మంచి గుర్తింపు సంపాదిస్తూనే, ప్రేక్షకులు మెచ్చిన విజయాలు సాధిస్తున్నాడు. గతేడాది పవర్ పాండి సినిమాతో దర్శకుడుగా మారారు. మొదటి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభను చూపించి ధనుష్ దేనికి తక్కువ కాదని నిరూపించాడు. ఆమద్య మామ రజినీకాంత్‌తో ‘కాలా’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే.

‘కాలా’ చిత్రం సమయంలోనే మామను డైరెక్ట్ చేసేందుకు ఒక కథను సిద్దం చేశాడట. తాను స్వయంగా హీరోగా నటిస్తూ మామ రజినీకాంత్‌ను పవర్ ఫుల్ రోల్‌లో చూపిస్తూ ఒక చిత్రాన్ని చేయాలని ధనుష్ అనుకున్నాడట. కాని రజినీకాంత్ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపించలేదట. దాంతో రజినీకాంత్ కోసం రాసుకున్న ఆ పాత్రకు నాగార్జునను ఎంపిక చేశారని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.

Akkineni Nagarjuna

తాజా ఇంటర్వ్యూలో ధనుశ్ మాట్లాడుతూ .. “ఈ సినిమాలో నాగార్జునగారు చేస్తోన్న పాత్ర ముందుగా ఆయన కోసం అనుకున్నది కాదు. ఈ పాత్రను రజనీకాంత్‌తో చేయించాలనే ఉద్దేశంతో ఆయనను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినది. రజనీకాంత్ రాజకీయాలతో బిజీగా వుంటూ తాను చేయలేనని చెప్పేశారు. దాంతో నాగార్జున ఐతే బాగుంటుందని అనుకున్నాను. 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా, నాగార్జునకి గల క్రేజ్ కారణంగా తెలుగులోను దూసుకుపోతుందనే నమ్మకం వుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -