కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం.. హీరో నాగార్జున

298
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సంబురాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈ రోజు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పటువురు రాజకీయ నేతలు,సినీ ప్రముఖులు తమదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ కింగ్,హీరో అక్కినేని నాగార్జున కూడా ఆయన స్పందనను తెలియజేశారు.

Akkineni Nagarjuna

‘నీరే జీవనానికి ఆధారం. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం. మానవ ఇంజనీరింగ్ మేథకు ఓ మచ్చుతునక. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ సీఎం కార్యాలయాన్ని ఇందుకు ట్యాగ్ చేశారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు ఏపీ సీఎం జగన్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -