అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు మారుతి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నాగ చైతన్యకు జంటగా అనుఇమ్మాన్యుఎల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినీయర్ నటీ రమ్మకృష్ణ ఈసినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా మూవీ విడుదల తేదిని ప్రకటించారు చిత్రబృందం.
సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 31వ తేదిన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నాగచైతన్యకు అత్త పాత్రలో రమ్మకృష్ణ నటించారు. అత్తా అల్లుడు మధ్యలో సాగే కథను మనం ఈమూవీలో చూడవచ్చు అని తెలుస్తుంది. ఇటివలే శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.
ఇప్పటివరకూ ఇలాంటి కథలు చాలానే వచ్చినా ఈకథ చాలా డిఫరెంట్ గా ఉండనుందని చెబుతున్నారు దర్శక, నిర్మాతలు. త్వరలోనే ఆడియోలాంచ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ఇక నాగ చైతన్య నటించిన మరో సినిమా సవ్వసాచి. ఈచిత్రాన్ని కూడా ఈనెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా..కన్నడ నటుడు మాధవన్, సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటించనున్నారు.