అక్కినేని ఇంట పెళ్లి సందడి….

286
Akkineni Family
- Advertisement -

అక్కినేని కుర్రాళ్ల వివాహ శుభకార్యాలకు ముహూర్తాలు ఖరాయ్యాయి.డిసెంబర్ 9 నుంచి మొదలయ్యే అక్కినేని ఇంట మొదలయ్యే సందడి వచ్చేఏడాది ఆగస్టు వరకు కొనసాగనుంది. చైతు కంటే చిన్నవాడైన అఖిల్ కు నాగ్ ముందుగా పెళ్లి చేస్తున్నాడు. డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం, ఆ తరువాత రెండు నెలలకు రోమ్ లో డెస్టినేషన్ పద్దతిలో వివాహం జరగనుంది. ప్రస్తుతం నిశ్చితార్థ వేడుకకు నాగ్ ప్రముఖులను ఆహ్వానించే పనిలో ఉన్నాడు.

Akkineni Family

అయితే తాజగా ప్రేమ జంట నాగచైతన్య, సమంత పెళ్లీ తేదీ కూడా నిశ్చయమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఆగస్టులో నాగచైతన్య, సమంతల వివాహం తొలుత హిందూ సంప్రదాయం జరగనుంది. ఆ తరువాత మరోసారి క్రైస్తవ పద్దతిలో ఈ ప్రేమజంటకు వివాహం చేయనున్నారు. నాగార్జున, నాగ చైతన్య చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని ప్రకటించారు. చైతు వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే నాగ్ అఖిల్ కు ముందు పెళ్లి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో నాగ్ చైతన్య సమంత వివాహ తేదీని ఆగస్టులో ఖరారు చేశాడట. ఈ విషయంపై తర్వలోనే నాగ్ అధికారిక ప్రకటన చేస్తాడని సమాచారం.

Akkineni Family

- Advertisement -