అక్కినేని అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం మిస్టర్ మజ్ను. ఈమూవీ ఆడియో ఫంక్షన్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హాజరుకాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ ఆడియో వేడుకలో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్‌ని తాను ‘టైగర్’ అనే పిలుస్తానని, నిజంగా, ఆయన ‘టైగరే’ అనే అఖిల్ ప్రశంసించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ వేరని కొనియాడాడు. ‘తారక్ గారు’ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోడని, ఓ సందర్భంలో తాను ‘థ్యాంక్స్’ చెప్పినా కూడా ఒప్పుకోలేదని, ‘ఇది నా బాధ్యత’ అని తారక్ చేసిన వ్యాఖ్యలను అఖిల్ ప్రస్తావించాడు.
అఖిల్నటిస్తున్న ఈ చిత్రానికి తొలిప్రేమ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈచిత్రాన్ని వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇటివలే విడుదలైన ఈచిత్ర టీజర్ , ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దింతో ఈమూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. జనవరి 25న ఈమూవీని విడుదల చేయనున్నారు.