మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఆరంగేట్రానికి రంగం సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ తెరంగేట్రంపై కొంతకాలంగా వార్తలు వెలువడుతుండగా వారికి తీపికబురుని అందించనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
అకీరా డెబ్యూ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరించనున్నారని సమాచారం. తనకు అత్యంత ఇష్టమైన బాబాయ్ పవన్ కొడుకుని ఇండస్ట్రికి తానే లాంచ్ చేస్తే బాగుంటుందని చెర్రీ భావిస్తున్నారట.
గతంలో రేణూ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా చిన్న పాత్రలో నటించాడు. తాజాగా హీరోగా అకీరా నందన్ మూవీకి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారనే వార్త పవన్ ఫ్యాన్స్‌కు ఆనందాన్నిస్తోంది.
ఇక చాలాకాలం గ్యాప్ తర్వాత ‘పింక్’ రీమేక్‌తో సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టేశారు పవన్ . దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది.