అఖిల్ ‘హలో’ మూవీకి అరుదైన గౌరవం..

233
Akhil’s ‘Hello’ Gets Nominated For World Stunt Awards
- Advertisement -

అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘హలో.’ ఈ సినిమా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఫారిన్ ఫిల్మ్ ఎట్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్‌లో ఈ చిత్రం బెస్ట్ యాక్షన్ కేటగిరీకి నామినేట్ అయింది. ఈ విషయాన్ని దర్శకుడు విక్రమ్ కుమార్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Akhil’s ‘Hello’ Gets Nominated For World Stunt Awards

‘‘హలో చిత్రం ఫారిన్ ఫిలిం ఎట్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్షన్ సినిమా కేటగిరీకి నామినేట్ అవ్వడంతో చాలా గర్వంగా ఫీలవుతున్నాను. బాబ్ బ్రౌన్, పీఎస్ వినోద్, అనూప్ రూబెన్స్, నాగార్జున సార్ చాలా ఆనందించారు. మీరంతా కలిసి ఈ సినిమాను చాలా స్పెషల్‌గా చేశారు. అఖిల్ అక్కినేని ఇది నీ హార్డ్ వర్క్‌కు దక్కిన ప్రతిఫలం. నీ యాటిట్యూడ్ నిన్ను ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది’’ అంటూ విక్రమ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

హలీవుడ్ స్టంట్ మాస్టర్ బాబ్‌ బ్రౌన్‌ యాక్షన్ సీన్లు తెలుగు తెరపై కొత్తగా కనిపించడం, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో అఖిల్ యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేయటంతో ఈ గౌరవం దక్కిందని చెప్పాలి. ప్రఖ్యాత అన్నపూర్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మించగా కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా నటించింది.

- Advertisement -