ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే పంజాబ్, గోవాల్లో పోలింగ్ పూర్తవగా ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 73 నియోజకవర్గాల్లో 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 839 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఇక హోరాహోరిగా సాగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఇక ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు ఈ సారి కొత్త పంథాను ఎంచుకున్నారు. మోడీ, బీజేపీ జీలేబీలతో కమల దళం ప్రచారం నిర్వహించగా ఇంకొందరు ఏకంగా పాడెపై కూర్చోని ప్రచారం చేశారు. ఇక యూపీలో ఐతే ఉత్తరఖండ్ ట్రెండ్‌ను రిపీట్ చేశారు అధికార ఎస్పీ నేతలు. ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ బాహుబలిలో ప్రభాస్‌ను అనుకరిస్తూ శివలింగాన్ని కటౌట్‌తో ప్రచారం నిర్వహించారు. ఉత్తరాఖండ్ పోరాట యోధుడు హరీష్ అంటూ క్యాప్షన్ రాసిఉండగా ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా అవాక్కయినట్లుగా ఈ ఫోటోలో కనిపించేలా డిజైన్ చేసి ఆకట్టుకున్నారు.
తాజాగా హరీష్‌నే ఫాలోఐన అఖిలేష్ రాయిస్ అంటూ ముందుకొచ్చాడు. షారుఖ్ ఖాన్ రాయిస్ ట్రైలర్‌ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది ఎస్పీ. ఇందులో షారుఖ్‌ఖాన్‌గా అఖిలేష్ యాదవ్, హీరోయిన్ మషీరా ఆయన సతీమణి డింపుల్ యాదవ్ ఇక నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్రలో నరేంద్ర మోడీని చూపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులరైంది. ఆప్‌లోడ్ చేసిన కొద్ది సమయంలోనే ఈ వీడియోను దాదాపు ఐదు లక్షల మంది వీక్షించారు.
https://youtu.be/mScvJGHona4