అఖిలేష్‌కే సైకిల్‌…..

130
Akhilesh gets cycle

సమాజ్ వాదీ పార్టీ గుర్తు సైకిల్ ఎవరిదో ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. సైకిల్ అఖిలేష్ వర్గానికి చెందుతుందంటూ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంకు షాకిచ్చింది. సమాజ్‌వాదీలో 50 శాతానికి పైగా పదాధికారులు అఖిలేష్ వైపు ఉన్నందునే ఆయన వర్గానికి సైకిల్ గుర్తు కేటాయించినట్లు ఈసీ తెలిపింది. యూపీలో ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకూ ఏడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కుటుంబంలో చీలికలు ఏర్పడి చులకనైపోయిన తరుణంలో సైకిల్ కూడా దక్కకపోవడంతో ములాయం షాక్‌నుంచి తేరుకోలేకపోతున్నారు. అఖిలేష్ వైపు ములాయం సోదరుడు రాంగోపాల్ యాదవ్ ఉండగా ములాయం వైపు మరో సోదరుడు శివ్‌పాల్ యాదవ్ ఉన్నారు. సరిగ్గా ఎన్నికల వేళ ములాయంకు అత్యంత సన్నిహితుడు అమర్ సింగ్ కూడా దేశం వదిలి లండన్ వెళ్లిపోతున్నారు.