మోనాల్‌ను మిస్సవుతున్నా: అఖిల్

156
akhil
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 100 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకుంది. ఇక గత వారం ఇంటి నుండి మోనాల్ ఎలిమినేట్ కాగా ఆమె లేకపోవడంతో తెగ ఫీల్ అయిపోయాడు అఖిల్. మోనాల్‌ని తలుచుకుంటు కన్నీరు పెట్టుకున్నాడు.

మోనాల్‌ తోడు లేక‌పోవ‌డంతో పిచ్చి లేస్తుంద‌ని… నా గుండె చాలా భారంగా ఉందని తెలిపాడు అఖిల్. ఆలోచించకుండా ఉండటానికి ట్రై చేస్తున్నా..కానీ నావల్ల అవడం లేదన్నారు. అన్నీ లోపల పెట్టుకుంటే బ్రేక్ అవుతాననే భయంతో భయటకు మాట్లాడేస్తున్నా.. ఏడుపు రావద్దు.. వద్దు.. వద్దు చాలా కంట్రోల్ చేసుకుంటున్నా అని తెలిపాడు.

తన బాధను హారికతో పంచుకున్న అఖిల్…. నాకు ఎప్పుడూ ఇంతిలా కాలేదు.. అర్థం కావడం లేదు దీనమ్మా.. అంటూ తెగ బాధపడిపోవడంతో.. హారిక అతడిని ఓదార్చే ప్రయత్నం చేసింది.

- Advertisement -