హలోపై పెరుగుతున్న అంచనాలు

221
akkineni akhil
- Advertisement -

హలో అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు అక్కినేని అఖిల్. .” మనం ” ఫేం విక్రం కుమార్ దర్శకత్వంలో ఈ యువ హీరో నటిస్తున్న ” హలో ” సినిమా   అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై వస్తోంది.  ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి  ప్రియదర్శిని. అనూప్ రూబెన్స్ మ్యాజిక్ డైరెక్టర్. డిసెంబరు 22 న ఈ చిత్రం విడుదల కానుంది. రెండేళ్ళ గ్యాప్ తర్వాత అఖిల్ మళ్ళీ నటిస్తున్న చిత్రమిది.

akhil-akkeni-

విక్రమ్‌ కుమార్‌ ఆషామాషీ దర్శకుడు కాదు. తన కథలు, ఆలోచనలు చాలా భిన్నంగా వుంటాయి. అతనితో సినిమా అనేసరికి క్లాస్‌గానో, ఎక్స్‌పెరిమెంటల్‌గానో వుంటుందని భావించారు. కానీ హలో టీజర్‌ చూస్తే ఇది పక్కా యాక్షన్‌ సినిమా అని తేలింది.ఇంతకాలం హలో మీద వున్న హైప్‌ చాలా సాధారణ స్థాయిలో వుంది కానీ ఇప్పుడు ఒకేసారి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నాగార్జునతో సహా అందరూ హలోతో అఖిల్‌ స్టార్‌ అయిపోయినట్టే ధీమా వ్యక్తం చేస్తున్నారంటేనే సినిమా బ్రహ్మాండంగా వచ్చిందనే సంగతి అర్థమవుతోంది.

- Advertisement -