తెలంగాణకు ‘హరితహారం’ కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. గత ఏడాది మొదలైన గ్రీన్ ఛాలెంజ్ ప్రస్తుతం రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమం ప్రారంభించారు. తాను స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జునను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. వారందరు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసిరారు.
ఇలా ఏడాదిగా ఈ కార్యక్రమం కొనసాగుతూనే వుంది. ప్రముఖులతో పాటు సామాన్యులూ భాగస్వామ్యం అయ్యారు. మొక్కలు నాటి, సెల్ఫీ దిగి పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో భారీగా కొనసాగింది. మధ్యలో లక్ష్యం ఒక కోటికి చేరినప్పుడు మొక్కను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాటారు. ప్రస్తుతం ఈ లక్ష్యం నేటికి రెండు కోట్ల మొక్కలకు చేరటంతో మరో సారి ఎంపీ సంతోష్ మొక్క నాటారు. అంతేకాదు ప్రస్తుతం మొక్కను నాటి మరి కొందరికి ఈ ఛాలెంజ్‌ను విసిరారు.
ఈ ఛాలెంజ్‌ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, సినీ హీరో అక్కినేని అఖిల్, జీఎంఆర్ గ్రూప్ అధినేత జీఎం రావు,వైఎస్‌ఆర్‌సీ ఎంపీ మిథున్ రెడ్డిలకు ఎంపీ సంతోష్ కుమార్ విసిరారు. అయితే ఈ ఛాలెంజ్‌ని ఇప్పటివరకు హీరో అఖిల్ అక్కినేని,వైఎస్‌ఆర్‌సీ ఎంపీ మిథున్ రెడ్డి సీకరించారు. ఈ మేరుకు వారు ట్విట్టర్ ద్వారా స్పందించారు.
I've accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge
from @ignitingmindsin & Planted 3 saplings Further I am appealing to @VSReddy_MP @AkhilAkkineni8 @GMR_Group,#GMRao@MithunReddyYSRC
to plant 3 trees & continue the chain
to make India Green by2022 pic.twitter.com/whGzbDAJdP— Santosh Kumar J (@MPsantoshtrs) August 18, 2019