హాట్‌స్టార్‌లో అఖండ

153
Akhanda
- Advertisement -

నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు తిరుగులేదని మరోసారి రుజువైంది. సింహ, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి ఇప్పుడు అఖండ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. సింహ, లెజెండ్‌ సినిమాలు అప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ హయ్యస్ట్ కలెక్షన్లు సాధిస్తే.. అఖండ మాత్రం కెరీర్ మొత్తంలో హయ్యస్ట్ గ్రాస్ సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ఏకంగా 103 కేంద్రాలలో అఖండ యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఇది కేవలం టాలీవుడ్‌లోనే కాదు భారత చలనచిత్ర పరిశ్రమలోనే అరుదైన ఫీట్. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 200 కోట్లు రాబట్టింది.అమెరికాలో ఏకంగా వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసింది.

ఇక నేటి నుండి హాట్ స్టార్‌లో అఖండ ప్రసారం కానుంది. ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అఖండ…ఓటీటీలో ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

- Advertisement -