నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం అఖండ
. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు రాత్రి 7:09 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ మూవీకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సి. రాం ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్.