నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ. వీరిద్దరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడం, విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఆ అంచనాలను బాలయ్య నిలబెట్టారా…?బోయపాటి- బాలయ్య కాంబో వర్కవుట్ అయిందా లేదా చూద్దాం..
కథ:
మురళీకృష్ణ (బాలకృష్ణ) ఫ్యాక్షనిజం బాట పట్టిన ఎంతోమందిని దారి మళ్లించి మార్పుకి శ్రీకారం చుడతాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆస్పత్రుల్ని కట్టించి ప్రజలకి సేవ చేస్తుంటాడు. అది చూసి కలెక్టర్ శరణ్య (ప్రగ్యాజైస్వాల్) మురళీకృష్ణపై ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. ఇక ఆ ప్రాంతంలో మైనింగ్ మాఫియాని నడిపే (శ్రీకాంత్)తో మరళీ కృష్ణకి సవాళ్లు ఏర్పడతాయి. తర్వాత ఏం జరుగుతుంది….చివరకు ఎలా సుఖాంతం అవుతుంది అనేదే అఖండ కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ బాలకృష్ణ నటన, సంగీతం, భావోద్వేగం. బాలకృష్ణ వన్ మేన్ షోలా సినిమాపై అంచనాలు పెంచేశారు. రెండు పాత్రల్లో చక్కగా నటించారు. ప్రగ్యా జైస్వాల్ చక్కని నటన కనబర్చగా శ్రీకాంత్‌ని వరద రాజులుగా క్రూరమైన పాత్రలో చూపించి ఆకట్టుకున్నారు. జగపతిబాబు, కాలకేయ ప్రభాకర్ ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కొన్ని పోరాట ఘట్టాలు సుదీర్ఘంగా సాగడం.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. పాటలు బాగున్నాయి. రామ్‌ప్రసాద్ కెమెరా పనితనం, ఎం.రత్నం మాటలు, రామ్‌లక్ష్మణ్, స్టంట్ శివ పోరాట ఘట్టాలు మెప్పిస్తాయి. బోయపాటి తనదైన మార్క్‌ని ప్రదర్శిస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే, భావోద్వేగాలు కూడా బలంగా పండేలా సినిమాని తీర్చిదిద్దారు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
బోయపాటి- బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
విడుదల తేదీ:02/12/2021
రేటింగ్:3/5
నటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్
సంగీతం: తమన్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
దర్శకుడు: బోయపాటి శ్రీను