భారీ రేటుకు బాల‌య్య ‘అఖండ‌’..

367
nbk
- Advertisement -

నటసింహ బాల‌కృష్ణ‌- మాస్‌ డైరెక్టర్‌ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘అఖండ‌’. ఇందులో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. అది కూడా కవల సోదురులుగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. కొన్ని నిమిషాల తేడా వల్ల జన్మించిన ఈ ముగ్గురు జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది. దానిక జ్యోతిషం కనెక్ట్ చేసి బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రగ్య జైశ్వాల్ కథానాయికగా న‌టించింది.

ఇక ఇటీవలే చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్.. మే 28న విడుద‌ల కానున్న ఈ చిత్రం ఓటీటీ డీల్ సహా శాటిలైట్ డీల్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. మాటీవీ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకోగా.. హాట్ స్టార్ ఓటీటీ హక్కుల్ని చేజిక్కించుకుంది. ఓటీటీ రైట్స్‌ను హాట్ స్టార్ భారీ మొత్తంకు ద‌క్కించుకుంద‌ని ఇన్‌సైడ్ టాక్.

టీజ‌ర్‌లో బాల‌య్య త‌న చేతిలో త్రిశూలం మెడలో రుద్రాక్షలతో అఘోరా గెటప్ లో క‌నిపించి సంచలనాలు సృష్టించాడు. ఈ పాత్రలో అతడి ఆహార్యం పీక్స్ కు చేర‌డంతో డీల్‌పై హైప్ పెరిగింది. గ‌త చిత్రాల క‌న్నా ఈ సినిమాపై బాల‌య్య అభిమానుల‌లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి.

- Advertisement -