11న అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

8
- Advertisement -

లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జూన్ 11వ తేదీ 11వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

అయోధ్యకాండలోని 40 నుండి 44వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం ఐదు స‌ర్గ‌ల్లో 162 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 187 శ్లోకాల‌ను పారాయణం చేస్తారు. ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Also Read:హాయిగా నిద్ర పోవడానికి..!

- Advertisement -