బాలకృష్ణ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అఖండ–2’ విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అనివార్య కారణాల వల్ల షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
‘అఖండ–2’ విడుదలను వాయిదా వేయాల్సి వచ్చినందుకు చింతిస్తున్నామని, ఇది పూర్తిగా తమ నియంత్రణలో లేని పరిస్థితుల ఫలితమని సంస్థ తెలిపింది. బరువెక్కిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, అభిమానులకు ఈ అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతున్నామని పేర్కొంది.
పూర్తి నాణ్యతతో చిత్రాన్ని అందించాలనే బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని, అభిమానుల సహకారం, సహనానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు.
‘అఖండ’కు భారీ స్థాయి సక్సెస్ రావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటువంటి సమయంలో విడుదల వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురి చేసినప్పటికీ, ఉత్తమమైన అనుభవం కోసం తీసుకున్న నిర్ణయంగా పలువురు చూస్తున్నారు.

Also Read:ఓటీటీలోకి మిషన్ ఇంపాజిబుల్!

