చాంద్రాయణగుట్టలో అక్బర్ గెలుపు…

305
Akbaruddin-Owaisi
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ తొలి ఫలితం వెల్లడైంది. చాంద్రాయణగుట్టలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. ఇక మిగితా స్ధానాల్లో టీర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుండగా కాంగ్రెస్ అగ్రనేతలు వెనుకంజలో ఉన్నారు,సిరిసిల్లలో తొలిరౌండ్‌లో 4,764 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్. అంబర్‌పేటలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 1839 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు 10 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన రిపోర్ట్ నిజ‌మైంది. కారు జోరుకు బ్రేక్ లేద‌ని తేలింది. ఇప్ప‌టికే మ్యాజిక్ మార్క్‌ను దాటేసింది. ఇక ప్ర‌భుత్వ ఏర్పాటు లాంచ‌న‌మే.

ముషీరాబాద్‌లో బీజేపీ చీఫ్ లక్ష్మణ్ వెనుకంజ. కాంగ్రెస్ అభ్యర్థులు జానారెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, రేవంత్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభావకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతి వెనుకంజలో ఉన్నారు.

- Advertisement -