డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తనయుడు ఆకాష్ పూరీ కథానాకుడిగా రూపొందించిన చిత్రం మెహబూబా. మే 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆకాశ్ పూరీ ఓ చానల్ ఇంటర్వూలో మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు ఇష్టమైన హీరో అంటే రవితేజనే అని చెప్పుకొచ్చారు.
నాకు ఊహతెలిసినప్పటి నుంచి రవితేజ సినిమాలే చూస్తూ పెరిగానన్నారు. రవితేజ, మా నాన్న కలిసి చేసిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్ వంటి చిత్రాలు చాలా సార్లు చూసానని చెప్పుకొచ్చారు ఆకాశ్. నిజానికి రవితేజని చూసాకే నేను హీరో కావాలనుకున్నానని తెలియజేశారు. మా నాన్న, రవితేజ చాలా కష్టపడి.. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారని అందుకే వాళ్లంటే నాకు ఎనలేని అభిమానమని, వాళ్ల నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలిపారు.
ఆకాశ్ పూరీ కెరీర్లో మెహబూబా రెండవ చిత్రం. తనయుడి కెరీర్‌పై దృష్టిపెట్టిన పూరీ స్వరంగా తానే ఈ సినిమాకి నిర్మాతగా మారి భారీ బడ్జెట్‌తో తెరికెక్కించారు. అయితే ఈ సినిమా కోసం పూరీ ఓ ఇల్లు కూడా అమ్మేశాడు. సినీ పరిశ్రమకి కొత్తగా వస్తున్న కుర్రాడిపై పెద్ద మొత్తంలో డబ్బులు ఏ నిర్మాత పెట్టరని, పెట్టినా… అనేక ఆంక్షలు పెడతారని, అందుకే తాను ఈ సినిమాను నిర్మించానని పూరీ చెప్పారు. డబ్బుల గురించి పెద్దగా ఆలోచించనని.. ఎలా సంపాదించుకోవాలో తనకు తెలుసని చెప్పుకొచ్చారు.