చాలమంది కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి వంటి సమస్యలతో భాదపడుతూ ఉంటారు. నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యలు వేధిస్తున్నాయి. ఈ సమస్యలు రావడానికి కారణాలు చాలానే ఉన్నప్పటికి శారీరక శ్రమ లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే ఇలాంటి సమస్యలకు యోగాలో చాలా ఆసనాలు చక్కటి పరిష్కారం చూపుతాయి. అందులో ఒకటి ” ఆకర్ణ దనురాసనం ” ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల కీళ్ళు సడలించబడి నొప్పులు దురమౌతాయి. తుంటి భాగాలు శక్తినొందుతాయి. కాళ్ళ కండరాలు దృఢంగా తయారవుతాయి. నాడీ వ్యవస్థ సాగదితకు గురై పని తీరు మెరుగుపడుతుంది. ఉదర సమస్యలు కూడా దురమౌతాయి. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వెన్నెముక కు రక్తప్రసరణ మెరుగుపడి వెన్ను సమస్యలు దురమౌతాయి.
ఆకర్ణ దనురాసనం వేయు విధానం
చదునైన నేలపై యోగా షీట్ వేసుకొని కాళ్ళు చాచుకొని కూర్చోవాలి. ఆ తరువాత రెండు చేతులను రెండు కాళ్ళకు సమాంతరంగా ఉంచి కాళ్ళ బొటనవేళ్ళను పట్టుకోవాలి. ఆ తరువాత ఊపిరి పిల్చుకొని కుడికాలును మోకాలు వరకు మడిచి చెవి భాగం వరకు తీసుకొని రావాలి. ఇలా చేసేటప్పుడు కాలుయొక్క బొటన వేలును అలాగే పట్టి ఉంచాలి. మరోవైపు ఎడమ కాలు నేలకు అలాగే సమాంతరంగా ఉంచి ఎడమచేతితో కాలుయొక్క బొటన వేలును అలాగే పట్టి ఉంచాలి. ఇలా వీలైనంతా సమయంలో ఈ భంగిమలో ఉండి తరువాత మరో ప్రక్క కూడా ఇలాగే చేయాలి. ఇలా 10-15 నిముషాల పాటు ” ఆకర్ణ దనురాసనం ” వేయాలి.
Also Read:Rahul:ప్రతి పేద కుటుంబానికి లక్ష సాయం
గమనిక
ఈ ఆసనం యోగా నిపుణుల పర్యవేక్షణలో చేయాలి, నడుం నొప్పి అధికంగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయకపోవడమే మంచిది.