- Advertisement -
హీరో అజిత్ ప్రొఫెసర్ అవతారం ఎత్తారు.AK61ay ప్రొఫెసర్‌గా కనిపించనున్నారు. నేర్కొండ పార్త్వై, వలిమై చిత్రాల దర్శకుడు హెచ్. వినోద్‌తో వరుసగా మూడో సినిమా చేస్తున్నారు అజిత్. ఈ సినిమాని కూడా బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కనుంది.
అజిత్‌కు జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించబోతున్నట్టు టాక్. బాలీవుడ్‌లో కథానాయికగా బిజీ అయ్యాకా చాలా గ్యాప్ తర్వాత రకుల్ ఈ సినిమాతో మళ్ళీ కోలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన వివరాలను బోనీకపూర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
- Advertisement -