- Advertisement -
ఎన్సీపీ నుంచి అజిత్ పవార్‌ను సస్పెండ్ చేశారు ఆ పార్టీ అధినేత శరద్ పవార్. దీంతో పాటు ఎన్సీఎల్పీ నేతగా అజత్ పవార్‌ను తొలగించింది. మరోవైపు ఎన్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అజిత్ పవార్‌కు వ్యతిరేకంగా ఎన్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
ఇక మహారాష్ట్రలో నెలకొన్న పరిస్ధితులపై మీడిమా సమావేశం నిర్వహించనున్నారు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే,ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ఇప్పటికే ఎన్సీపీ కార్యాలయానికి చేరుకున్న ఠాక్రే…శరద్ పవార్‌తో కలిసి మీడియతో మాట్లాడననున్నారు.
ఇక సాయంత్రం 4.30 గంటలకు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు శరద్ పవార్. 30 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ మీటింగ్ కు ఎంతమంది హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది.
- Advertisement -