అజిత్ కుమార్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’

19
- Advertisement -

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్, స్టార్ హీరో అజిత్ కుమార్‌తో తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేయడంపై ఆనందంగా ఉంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌తో రూపొందే ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ”దిగ్గజ స్టార్ అజిత్ కుమార్ సర్‌తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ స్క్రిప్ట్, కథనం అద్భుతంగా వున్నాయి. అభిమానులు, సినిమా ప్రేమికులకు గ్రిప్పింగ్, ఆకట్టుకునే సినిమాటిక్ అనుభవాన్నిఅందించడానికి మేము సంతోషిస్తున్నాము. ”

నిర్మాత వై రవిశంకర్‌ మాట్లాడుతూ..”అజిత్‌ కుమార్‌ సర్‌తో జట్టుకట్టడం ఆనందంగా ఉంది. అధిక్ అద్భుత దర్శకత్వ ప్రతిభ అతని మునపటి చిత్రాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొత్త చిత్రం నెక్స్ట్ లెవల్ లో వుండబోతుంది.’ అన్నారు

దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ ”ప్రతి ఒక్కరి జీవితంలోనూ, కెరీర్‌లోనూ అమూల్యమైన క్షణాలు ఉంటాయి, ఇది నా జీవితంలో అద్భుతమైన క్షణం. నా మ్యాట్నీ ఐడల్ ఎకె సర్‌తో కలిసి పనిచేయడం చాలా నా చిరకాల కల. ఈ సినిమాతో ఆ కలగా నేరవేరడం ఆనందంగా వుంది. ఈ అవకాశం కల్పించిన నిర్మాతలు నవీన్‌ యెర్నేని సర్‌, రవిశంకర్‌ సర్‌లకు కృతజ్ఞతలు’’ తెలిపారు.ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందనున్న ఈ చిత్రానికి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రీకరణ జూన్ 2024లో ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం 2025 పొంగల్‌కు విడుదల కానుంది.

Also Read:భరతనాట్యం..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -