ప్రతిభకు పట్టం..అజిత్ దోవల్‌కు కేబినెట్ హోదా

400
ajit doval
- Advertisement -

కేంద్ర కేబినెట్ విస్తరణలో తనమార్క్ చూపించిన నరేంద్రమోడీ అధికారుల ఎంపికలోనూ అదే పద్ధతి పాటిస్తున్నారు. ప్రతిభకు పట్టం కడుతున్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పదవీ కాలాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.

అంతేగాదు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పదవికి కేబినెట్ ర్యాంకు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.దేశ భద్రత లో అజిత్ దోవల్ పోషిస్తున్న ప్రాధాన్యతను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

జాతీయ భద్రతా సలహాదారు బాధ్యతలు చేపట్టకముందు దోవల్‌ ఐబీ చీఫ్‌గా వ్యవహరించారు. అజిత్‌ దోవల్‌ మార్గదర్శకత్వంలో యూరి ఉగ్రదాడి అనంతరం 2016లో పాకిస్తాన్‌పై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టగా, పుల్వామా దాడి అనంతరం 2018లోనూ బాలాకోట్‌లో భారత వైమానిక దళం సర్జికల్‌ స్ర్టైక్స్‌ నిర్వహించింది.వింగ్ కమాండ్ అభినందన్ వర్ధమాన్‌ను భారత్‌కు క్షేమంగా రప్పించడంలో భారత్ ప్రదర్శించిన దౌత్యంలోనూ అజిత్ దోవల్ మార్క్ ఉంది.

- Advertisement -