రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ

461
ajay-balla
- Advertisement -

అన్ని రాష్ట్రాలకు మరోసారి లేఖలు రాశారు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా. వలస కూలీల విషయంపై ఒకటి, మెడికల్, పారిశుధ్య పనివారు, ప్రైవేటు క్లినిక్ లు తెరిచే విషయాలపై లేఖలు రాశారు.

బస్సులు, శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో పలు రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అవకాశాలు కల్పించాలని లేఖలో కోరారు.

రైళ్లలో ప్రయాణించే వరకు ఆయా రాష్ట్రాలు వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంపులు కొనసాగించాలి… వారికి నీరు ఆహార, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

ప్రతి రాష్ట్రం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న.. వలసదారులను స్వస్థలాలకు వచ్చేందుకు అవకాశం కల్పించాలని… వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు.

వలసదారులు స్వస్థలాలకు వెళ్లేందుకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని ఇప్పటికే క్యాబినెట్ కార్యదర్శి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు అజయ్ భల్లా.

- Advertisement -