ఇంద్రనీల్ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మృదాంజలి కీలక పాత్రధారులుగా రాజ్ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఐతే 2.0’. ఫర్మ్ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్రం మోషన్ పోస్టర్, టీజర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకురాలు నందినీరెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …
నందినీ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ మధ్య కాలంలో రెగ్యులర్ సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్ వైపు కూడా చూడటంలేదు. తెలుగు ఆడియెన్స్‌లో చాలా మార్పొచ్చింది. కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. రాజ్ మాదిరాజు అమేజింగ్ కథ రాశారు. ఆయన రచనాశైలి అంటే నాకు చాలా ఇష్టం. ఇది మంచి సినిమా అవుతుంది’’ అని అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘‘ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ సినిమా ఇది. ఇలాంటి కథను ఎంచుకున్న దర్శకుడు రాజ్ మాదిరాజ్‌గారిని అభినందిస్తున్నాను. సాంకేతికంగా సినిమా చాలా బావుంది. టీజర్ ఆసక్తికరంగా ఉంది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు.
దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ ‘‘ఇంజనీరింగ్ పూర్తి చేసి నిరుద్యోగంతో ఉన్న నలుగురు యువకులు ఆకలికీ, ఆశకి లొంగక ఆక్రోశానికి బలై క్రిమినల్స్‌గా ఎలా మారారు అన్న పాయింట్‌కు నేటి టెక్నాలజీ, సోషల్ మీడియా, హ్యాకింగ్ వంటి అంశాలను కీలకంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమిది. ప్రస్తుతం ఇంటర్‌నెట్ వలలో ఇరుక్కుపోయిన జనాలకు ఈ సినిమా ద్వారా చక్కని సందేశం ఇస్తూ ఓ హెచ్చరిక కూడా ఇస్తున్నాం. పూర్తిగా ప్రయోగాత్మక చిత్రమిది’’ అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ ‘‘యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చక్కని వినోదాన్ని కూడా పంచుతుంది. ఈ సినిమాలో నిజాల్ని చెప్పబోతున్నాం. తెలుగులో కాదు.. హిందీలో కూడా సినిమాను విడుదల చేయబోతున్నాం. త్వరలో ట్రైలర్‌ను, పాటల్ని విడుదల చేసి మార్చి 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చెప్పారు.
హీరోయిన్ మాట్లాడుతూ – “ఒక మంచి సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్, నిర్మాతలకు థాంక్స్. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇలాంటి సినిమాలో నటించడం గర్వంగా ఉంది“ అన్నారు.
హీరో మాట్లాడుతూ – “చాలా డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటించాను. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నవారు.. ఇంజనీరింగ్ చదువుతున్నవారు చూడాల్సిన సినిమా ఇది. ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్ అభిమన్యు, ఎడిటింగ్: కార్తీక్ పల్లె, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అరుణ్ చిలువేరు. నిర్మాతలు : కె.విజయరామరాజు, డా.హేమంత్ వల్లపు రెడ్డి దర్శకత్వం: రాజ్ మాదిరాజ్.