హీరోకు కన్నుగీటి కవ్వించి, చూపు తిప్పుకోనివ్వని కళ్లతో మైమరపించి, అతని బుగ్గలకు క్రీమ్ రాసి పెదవులతో తుడిచి.. ఇంకా రకరకాల చేష్టలతో ఐశ్వర్య రాయ్ అదరగొట్టింది. ‘ఏ దిల్ హై ముష్కిల్’తో 42 ఏళ్ల వయసులోనూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా మైమరిపించింది.రణ్ బీర్ కపూర్ తో కలిసి రొమాన్స్ ను అద్భుతంగా పండించి…సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఇక తెరపై షారుక్ ఖాన్.. ఐశ్వర్యరాయ్ కెమిస్ట్రీ గురించి చెప్పనక్కర్లేదు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘మొహబ్బతే’.. ‘హమ్ తుమ్హారే హై సనమ్’.. ‘దేవదాస్’ చిత్రాలు క్లాసికల్ హిట్స్‌గా నిలిచాయి. తాజాగా వీరిద్దరూ జంటగా కరణ్‌జోహార్ చిత్రం ‘యే దిల్‌హై ముష్కిల్’లో మెరిశారు. ఈ జంట తెరపై కొద్దిసేపే కనిపించినా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో షారుక్.. ఐష్లతో ఓ సినిమా తీయాలని కరణ్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త ఐష్ చెవికి చేరడంతో ఈవిధంగా స్పందించింది.
‘ కరణ్ దర్శకత్వంలో షారుక్‌తో నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. అది వట్టి పుకారు మాత్రమే. ప్రస్తుతం స్క్రిప్టులు వింటున్నా. నాకు సర్ప్రైజ్లు ఇవ్వడం అంటే ఇష్టం. నా తర్వాతి చిత్రంతో అందరికీ సర్ప్రైజ్ ఇస్తా.’ అని చెబుతోంది ఐష్.మరి ఐష్ చెప్పే ఆ సర్ ప్రైజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక యే దిల్ హై ముష్కిల్ లో రణబీర్‌తో ఐష్ శృతిమించి రొమాన్స్ చేసిందని…దీంతో త్వరలో ఐష్-అభిషేక్ వివాహాబంధానికి బ్రేకులు పడనున్నాయన్న వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. ఐష్ జీవితం లో ఎన్నెన్నో వివాదాలు… మరెన్నో విమర్శలూ అయినా తొణకలేదు. తాజాగా భర్తతో విడాకులు తీసుకుంటోందీ అన్న పుకార్లను కూల్‌గానే తీసుకున్న ఐష్ దీపావళి పండుగను పురస్కరించుకుని బాలీవుడ్ నటీనటులకు ఇచ్చిన విందు పార్టీలో ఘాటైన సమాధానం చెప్పింది.అందరి ముందు అభిషేక్‌కు ముద్దుపెట్టి పుకార్లకు చెక్ పెట్టింది.