ప్రస్తుతం సోషల్ మీడియాలో #MeToo ఉద్యమం నడుస్తోంది. డబుల్ మీనింగ్ జోకులు, బలవంతంగా తాకే ప్రయత్నం చేయడం, సెక్స్ చేయమని కోరడం, ఇలా ఇతరుల నుంచి తమకు ఎదురైన పరిణామాల గురించి సినీ,క్రీడా,జర్నలిస్టు రంగాలకు చెందిన ప్రముఖులు వివరిస్తున్నారు. ఇప్పటికే సోనం కపూర్, ట్వింకిల్ ఖన్నా, ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్, సిమీ గరేవాల్, అనురాగ్ కశ్యప్, పూజా భట్, రవీనా టాండన్, కొయినా మిత్రా,గుత్తా జ్వాల తదితరులు స్పందించగా తాజాగా మాజీ విశ్వసుందరి ఐష్‌కు చేరింది.
ఇలాంటి విషయాలపై నా వాయిస్ ఎప్పుడు వినిపిస్తూనే ఉన్నాను…ఉంటాను అని స్పష్టం చేసింది ఐష్.మన దేశంలో మీటూ ఉద్యమం రావడం మంచి పరిణామం అని తెలిపారు. సోషల్ మీడియా వల్ల బాధితుల వాయిస్ అందిరికి వినిపిస్తుందన్నారు.
ప్రపంచంలో ఏ మూలన అన్యాయం జరిగిన సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుచుకోవచ్చని ప్రపంచం వారి బాధని వింటుందని తెలిపారు ఐష్. ఇలాంటి విషయాలను చెప్పడానికి సమయంతో పని లేదని…వారి బాధని వింటూ మద్దతిస్తే చాలని తెలిపింది.