‘2.0’ లో ఐష్‌..?

228
Aishwarya Rai in '2.0' ?
- Advertisement -

రజినీకాంత్‌, శంకర్‌ కాంబోలో ‘2.0’ మూవీ రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా నటిస్తుండగా..ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ప్రస్తుతం ‘2.0’ షూటింగ్‌ ఫినిష్ కాగా, సీజీ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ టీమ్‌ లో ఐశ్వర్యరాయ్‌ కూడా చేరిందని టాక్‌.

 Aishwarya Rai in '2.0' ?

ఐష్ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఇప్పటికే తన పాత్రకి డబ్బింగ్‌కూడా చెప్పినట్లు సమాచారం. ఇందులో మరో డౌట్‌ ఏంటంటే.. ఈ సినిమాలో ఐష్‌ కనిపిస్తుందా..? లేకా కామిక్ రోలా? అనేది సస్పెన్స్‌. కాకపోతే ఐష్‌ కనిపిస్తుందన్నది మాత్రం ఖాయం అన్నట్టుగా కోలీవుడ్‌ మీడియా చెబుతున్న మాట.

గతంలో రజినీ, ఐశ్వర్యరాయ్ కాంబోలో ‘రోబో’ సెన్సేషన్‌ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐశ్వ‌ర్య ఎంట్రీ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా..డైరెక్టర్‌ శంకర్‌ ‘రోబో’కి ఇది సీక్వెల్ కాదంటూ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. కాగా.. ‘2.0’ ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ అందించారు.

- Advertisement -