ఐష్ తో రొమాన్స్ కు కోట్లు అడిగాడు…

321
Maddy_Aish_
- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడు అయిన మాధవన్ ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేసాడు. 3 ఇడియట్స్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుని దాదాపు బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయిన మాధవన్ మనకు మాత్రం సఖి సినిమా హీరోగా ఎప్పటికీ మర్చిపోలేని హిట్ ఇచ్చారు మణిరత్నం.  అయితే ఇప్పుడు ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలో అనిల్ కపూర్ మరో కీలక భూమిక పోషిస్తున్న మూవీ ఫ్యానీ ఖాన్‌. షూటింగ్ జరుగుతోంది కూడా.  ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ నటిస్తున్న చిత్రం ‘ఫ్యానీ ఖాన్‌’. రాకేశ్‌ఓం ప్రకాశ్‌ దర్శకుడు. ఈ చిత్రంలో ఐష్‌కి జోడీగా నటుడు మాధవన్‌ నటిస్తాడనే ప్రచారం విస్తృతంగా జరిగింది.

madhavan-aish-1

అయితే ఈసినిమాలో ఐష్ కు జోడిగా మాధవన్‌ నటించడం లేదట.  మాధవన్ బారి పారితోషకం డిమాండ్ చేయడం తో చిత్రబృండం అంత ఇవ్వడానికి సిద్దంగా లేక పోవడంతో చిత్రం నుండి తప్పుకున్నారు. ఈ పాత్రకు మాధవన్ 1.5 కోట్లు డిమాండ్ చేశారట. కాని ఆయనతో కేవలం పది రోజుల చిత్రీకరణ మాత్రమే చేయాల్సి ఉండటం తో చిత్ర యూనిట్ అంత పారితోషికానికి ఒప్పుకోలేదు. ఆ తరువాత అతని స్థానంలో రాజ్‌కుమార్‌ రావ్‌ను ఎంపికచేసుకున్నారు. ఈ చిత్రానికి రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్‌ చిత్రం ‘ఎవ్రీబడీస్‌ ఫేమస్‌’ చిత్రానికి ఇది రీమేక్‌గా రాబోతోంది. 2007లో వచ్చిన ‘గరు’ చిత్రంలో ఐష్‌ కథానాయికగా.. మాధవన్‌ కీలక పాత్రలో నటించారు. మరో పక్క ఐష్‌.. అనిల్‌కి జోడీగా ‘తాల్‌’, ‘హమారా దిల్‌ఆప్కే పాస్‌ హై’ చిత్రాల్లో నటించారు.

- Advertisement -